HomeTelugu Trendingఅలియాభట్, సంజయ్‌లీలా భన్సాలీకి కోర్టు సమన్లు

అలియాభట్, సంజయ్‌లీలా భన్సాలీకి కోర్టు సమన్లు

Alia and Sanjay summoned byముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్‌ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, స్టార్ హీరోయిన్ అలియా భట్‌కు ముంబై కోర్టు నోటీసులు జారీచేసింది. మే 21న కోర్టులో హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. గంగూబాయ్ కతియావాడి సినిమా ముంబైలోని రెడ్‌లైట్ ప్రాంతం కామాటిపురా కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో టైటిల్ పాత్రను అలియా భట్ పోషిస్తోంది. ఇందులో గంగూబాయ్‌ను కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ గంగూబాయ్ దత్తపుత్రుడు రాజీవ్‌ షా పరువునష్టం దావా వేశాడు. దీంతో ముంబై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ సినిమా కోసం ముంబయ్‌ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్‌ వేశారు. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో షూటింగ్‌ నిలిచిపోయింది. ప్రస్తుతం ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినందున త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu