బాలీవుడ్ హీరోయిన అలియా భట్ ఆదివారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో అలియా డెలివరీ జరిగిందని సమాచారం. ఇక తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఏడున్నరకు ఆమె అడ్మిట్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అలియాతో పాటు ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా ఉన్నారు.
దీంతో అలియాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖలతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత రెండు నెలలకు ప్రెగ్నెన్సీని అలియా ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. కాగా, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అలియా భట్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.