HomeTelugu Big StoriesPawan Kalyan దారిలోకి వచ్చేసిన స్టార్ కమెడియన్.. కారణం అదేనా?

Pawan Kalyan దారిలోకి వచ్చేసిన స్టార్ కమెడియన్.. కారణం అదేనా?

Ali to test his luck with Pawan Kalyan OG
Ali to test his luck with Pawan Kalyan OG

Ali in Pawan Kalyan Movie:

తెలుగు సినీ పరిశ్రమలో అలీకి ప్రత్యేక స్థానం ఉంది. కానీ గత కొంతకాలంగా అలీ సినిమాలో స్పీడు తగ్గించేసారు. అప్పుడప్పుడు ఒక సినిమాలో కనిపిస్తున్న అలీ కి ఆఫర్లు తగ్గిపోయాయి అని కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఐస్మార్ట్ సినిమాతో అలీ మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో అని అభిమానులు అనుకున్నారు.

ఆగస్టు 15 న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అవగా.. పూరి జగన్నాథ్ తర్వాత అలీ మీద ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి. అలీ పోషించిన పాత్ర మీద చాలా మంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంట్లో అసలు మళ్ళీ అలికి సినిమా ఆఫర్లు వస్తాయా అని కూడా టాక్ నడిచింది. తాజాగా ఇప్పుడు అలీ తనకి ఎంతో మంచి స్నేహితులు అయినా పవర్ స్టార్ Pawan Kalyan చేస్తున్న ఓ జి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారట.

అయితే ఎప్పటినుంచో మంచి స్నేహితులైనప్పటికీ అలీ పవన్ కళ్యాణ్ జనసేన లో చేరకుండా 2019లో వైసీపీలో చేరడం చాలామందికి షాక్ ఇచ్చింది. కానీ ఈ మధ్యనే వైసీపీ ఘోర పరాజయం తర్వాత అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసారు. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. అలీ వైసీపీలో ఉన్న అన్ని రోజులు పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాలు చేశారు కానీ వాటిలో అలీ కనిపించలేదు. దీంతో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయేమోనని కొందరు అనుకున్నారు.

కానీ ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాక అలికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఓజి సినిమాలో ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాతో అందుకున్న నెగెటివిటీ మొత్తం పవన్ కళ్యాణ్ సినిమాతో పోతుంది అని ఫాన్స్ ఆశిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu