ప్రముఖ హాస్య నటుడు అలీ వైసీపీలో చేరాడు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయిన అనంతరం పార్టీలో చేరినట్లు ప్రకటించారు. వైసీపీ కండువా కప్పి అలీని జగన్ తన పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన అనంతరం నటుడు అలీ మీడియాతో మాట్లాడారు. 1999లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేశాను. మళ్లీ 2019లో ప్రచారం చేసి జగన్‌ను సీఎం చేయాలనుకుంటున్నాను అన్నారు. వైఎస్ జగన్ తనకు మాట ఇచ్చారని, మాట ఇస్తే జగన్ దానిని తప్పరని అలీ అన్నారు. జగన్ పాదయాత్ర ప్రజల్లో బాగా నాటుకుందని, జగన్ సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారని అలీ అన్నారు. తాను గతంలోనే వైఎస్ జగన్‌ను కలిశానని జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని కానీ తాను మాత్రం సమయం కావాలని అడిగినట్లు తెలిపారు. నాకోసం తన పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావొచ్చని నాకు హామీ ఇచ్చారు. జగన్‌ను సీఎంగా చేయడమే నా ఆశయం అని తెలిపారు.
అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని, ప్రచారం మాత్రమే చేస్తానని అలీ చెప్పారు. మీరు గతంలో చంద్రబాబుని కలిశారు, పవన్ కల్యాణ్‌ను కలిశారు. మీరు టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం కూడా జరిగిందన్న మీడియా ప్రశ్నలకు సమాధానంగా కొత్త సంవత్సరంలో అందరినీ కలిశాను, అందరికీ శుభాకాంక్షలు చెప్పి వచ్చాను అన్నారు. అందరినీ కలిసినట్టే జగన్‌ను, చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను కలిశానని తెలిపారు. రాజమండ్రి లేదా విజయవాడ టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తానని తెలిపారు.
ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన లక్ష్యమని సినీనటుడు అలీ తెలిపారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇచ్చిన మాటను తప్పరు. ప్రచారం చేసి మేజార్టీతో గెలిపించు. తర్వాత నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు.