Ali Quits Politics: ప్రముఖ కమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై తను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి నీకు కాదని రాజకీయాలకి తనకి సంబంధమే లేదని చెబుతున్నారు.
తను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరిమీద పన్నెత్తి మాట అనలేదని స్పష్టం చేశారు. “నేను ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, మా నాయకుడిని పొగిడానేమో కానీ ఎప్పుడూ అవతలి వాళ్ళని మాట అనలేదు. వాళ్ల జీవితం గురించి కానీ వ్యక్తిగత జీవితం గురించి కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఏ పార్టీ మనిషిని కాదు. నేను జస్ట్ కామన్ మ్యాన్ ని” అని చెప్పుకొచ్చారు అలి.
ఇకపై తాను కూడా ప్రతి ఐదేళ్లకి ఒకసారి అందరితో పాటే వెళ్లి ఓట్ వేస్తానని అన్నారు అలి. నిజానికి అలీ చాలా కాలం తెలుగుదేశం పార్టీ సపోర్టర్ గానే ఉన్నారు. 1999 నుంచి రాజకీయాల్లోకి రాజకీయాల్లో ఉన్నాను అని చెప్తున్న అలి అప్పటినుంచి తెలుగుదేశం పార్టీకే మద్దతుగా ఉన్నారు.
అయితే 2019లో వైసిపి గెలిచే అవకాశాలు ఎక్కువ గా ఉన్న సమయంలో టిడిపి వదిలేసి వైసిపి లోకి షిఫ్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్, అలీ మధ్య మంచి స్నేహం ఉంది. కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్, అలి నిజజీవితంలో కూడా చాలా మంచి స్నేహితులు.
కానీ అలి రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కి ఎటువంటి సహాయం చేయలేదు. 2019 లో కూడా టిడిపి నుంచి వచ్చేసిన అలీ వైసిపిలో చేరారు తప్ప తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వైపు కూడా చూడలేదు. దీంతో చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అప్పట్లో అలీపై విమర్శలు వర్షం కురిపించారు.
ఇప్పుడు వైసిపి ఎన్నికల్లో అతి దారుణంగా ఓడిపోగా అలీ ఇంక రాజకీయాలకే గుడ్ బై చెప్పేస్తున్నారు.
Ali Quits Politics:
వైసిపి నుంచి బయటకు వచ్చాక అలీ టిడిపిలోకి వెళితే ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీలోకి వెళుతున్నారని కామెంట్లు వస్తాయి. పోనీ జనసేనలో చేరదామా అంటే 2019లో పవన్ కళ్యాణ్ కి మద్దతు బాగా కావాల్సిన సమయంలో ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉపముఖ్యమంత్రి అయ్యాక జనసేన లో చేరినా కూడా విమర్శలు మాత్రమే వినిపిస్తాయి. అందుకే ఎటువంటి రిస్క్ లేకుండా అలి నెమ్మదిగా పాలిటిక్స్ నుంచి జారుకున్నారు అని చెప్పుకోవచ్చు.