HomeTelugu Big StoriesHit 3 : బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్న నాని..!

Hit 3 : బాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్న నాని..!

Ali Fazal to play key role in Nani's Hit 3
Ali Fazal to play key role in Nani’s Hit 3

Hit 3 Update:

నాని స్వయంగా నిర్మించిన హిట్ 1, హిట్ 2 సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లు అయిన సంగతి తెలిసిందే. ఆ ఫ్రాంచైజ్ లో భాగంగా ఇప్పుడు మూడవ సినిమా రాబోతోంది. Hit 3 అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఆ నటుడు మరెవరో కాదు అలీ ఫజల్. గత కొంతకాలంగా ఈ నటుడి మీద క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చారు అలీ. చిన్న చిన్న పాత్రలతో పేరు తెచ్చుకున్న అలీ ఫజల్ బాలీవుడ్ లో మాత్రమే కాక హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నారు. అందుకే అలీ ఫజల్ మీద ఉన్న క్రేజ్ భారీగా పెరిగింది.

ఒకవైపు బాలీవుడ్ సినిమాలు మరొకవైపు హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అలీ ఫజల్.. నిర్మాతల జేబులకు కన్నాలు పడే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటారు. తన పాత్రతో సంబంధం లేకుండా ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే వాళ్ల సినిమా చేయడానికి అలీ ఫజల్ రెడీగా ఉంటారు అని టాక్ కూడా నడుస్తోంది. కానీ అలీ ఫజల్ కి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ నుంచి బోలెడు భారీ ఆఫర్లు వస్తున్నాయి. అటు తమిళ్ నిర్మాతలు ఇటు తెలుగు నిర్మాతలు భారీ ఆఫర్లతో అలీ ఫజల్ వెనుక పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాలో కూడా అలీ ఫజల్ ఒక కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కాకుండా ఇప్పుడు నాని హిట్ 3 సినిమా కోసం కూడా అలీ ఫజల్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన చర్చలు ఇంకా జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రాబోతోంది.

బాలీవుడ్ లోనే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకునే అలీ సౌత్ సినిమాలకి ఇంకా ఎక్కువే తీసుకుంటారు. ఇక హిట్ 3 సినిమాకి స్వయంగా తానే నిర్మాత అయినప్పటికీ.. నాని స్వయంగా అలీ ఫజల్ ను తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూస్తూ ఉంటే హిట్ 3 సినిమా కోసం నాని భారీ స్థాయిలోనే బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ ఫ్రాంచైస్ ఎలాగో మంచి విజయాన్ని సాధించింది కాబట్టి మూడవ భాగం మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి Hit 3 సినిమాతో నాని ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu