నటుడు ఆలీ గురించి అందరికీ తెలుసు. హీరోగా, కమెడియన్ గా ఇప్పుడు యాంకర్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు నటుడు ఫిర్యాదు చేశారు. పలువురు సెలబ్రిటీలకు ఎదురైన సమస్యే ఇప్పుడు ఆలీకి ఎదురైంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లతో కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి అందులో తమ ఇష్టానుసారంగా పోస్టులు చేస్తూ ఉంటారు. దాంతో సెలబ్రిటీలు చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఆలీ పేరు మీద కూడా ట్విట్టర్ లో ఎవరో ఓ ఫేక్ అకౌంట్
క్రియేట్ చేసారు. దానికి 6000కి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అలీకి అసలు ట్విట్టర్ అకౌంటే లేదు. కానీ ఫేక్ అకౌంట్ మాత్రం ఎవరో క్రియేట్ చేసి దాంట్లో వారికి ఇష్టమొచ్చినట్టు పోస్టింగ్లు చేస్తున్నారు. దీనిపై అలీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.