టాలీవుడ్ లో పక్కనోళ్ల సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే జనాలు ఉన్నారని సినీ నటుడు అలీ అన్నారు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా వాళ్లు చంకలు గుద్దుకోవడం ఏమిటో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ధోరణి చాలా ఎక్కువయిందని తెలిపారు. ఇలాంటి దురాలోచనలను మానుకోవాలని అన్నారు.
బాగున్న సినిమాను కూడా బాగోలేదని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అలీ మండిపడ్డారు. అలా ప్రచారం చేస్తున్న వాళ్లు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. గతంలో చెన్నైలో తెలుగు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇలాంటి నెగెటివ్ ఆలోచనలు ఉండేవి కాదని అన్నారు. ఇక ‘ఎఫ్ 3’ సినిమాకు నిన్న కూడా హౌస్ ఫుల్ కలెక్షన్ వచ్చాయని… ఆ విషయం తెలిసి నటులుగా తామంతా సంతోషించామని చెప్పారు. మరోపక్క, ఇదే రకమైన విమర్శలను దర్శకుడు అనిల్ రావిపూడి కూడా చేశారు. కొందరు పనికట్టుకుని నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని మండిపడ్డారు. దయచేసి ఇలాంటివి మానేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. అవతలివారు బాగుండాలి అనుకుంటే భగవంతుడు మిమ్మల్ని వాడికంటే బాగా ఉండేలా చేస్తాడని ఆ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక `ఎఫ్ 3`లో తనని అనిల్ రావిపూడి చాలా బాగా చూపించాడని మంచి పాత్ర ఇచ్చాడన్నారు ఆలీ. క్లైమాక్స్ లో తన చేతికి ఓ గన్ ఇచ్చి కామెడీ చేయించారని ఎక్కడికి వెళ్లినా అంతా ఆ గన్ గురించే అడుగుతున్నారని తెలిపారు ఆలీ.