టాలీవుడ్ యువ నటుడు రానా దగ్గుబాటి ఈరోజు (ఆగస్టు 8) వివాహం చేసుకోబోతున్నారు. వేదమంత్రాల నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు హైదరాబాద్ రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. ఈ మేరకు రామానాయుడు స్టూడియోలో అన్ని సదుపాయాలతో పెళ్లి ఏర్పాట్లు, కళ్ళు చెదిరే అలంకరణ చేయించారట. కాగా రానా- మిహికాలకి స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ట్విటర్ ద్వారా రానాకు విషెస్ శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని’ అక్షయ్ ట్వీట్ చేశారు.
Perfect way to get permanently locked-down 🙂 Congratulations @RanaDaggubati , wishing you both a lifetime of happiness ♥️ https://t.co/asr7d0Vrf2
— Akshay Kumar (@akshaykumar) August 8, 2020