బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లక్ష్మీబాంబ్’. సౌత్‌లో లారెన్స్ నటించిన కాంచన సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఓటీటీ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అక్షయ్ హిజ్రా పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మొదటి నుండి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదట లవ్ జీహాదీ అంటూ ఈ చిత్రం పై కేసు నమోదు అయింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది . విడుదలైన తక్కువ సమయంలోనే ట్రైలర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. అక్షయ్ చేస్తున్న హిజ్రా పాత్ర పై చాలా మంది ప్రసంశలు కురిపించారు. తాజాగా ఈ సినిమాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా ఈ గురువారం సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెళ్లింది. ప్రేక్షకుల మనో భావాలను, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా టైటిల్‌ను మార్చాలని నిర్మాతలకు సూచించారు సెన్సార్ బోర్డు సభ్యులు. దాంతో ఈ సినిమా టైటిల్ ను మార్చారు నిర్మాతలు . ఈ హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కనున్న సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే పేరును తొలగించి లక్ష్మీ అని టైటిల్‌ని ఫిక్స్ చేశారు.