బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సాధారణంగా ఖాళీగా ఉన్న సమయాల్లో తనలోని ఇతర ప్రతిభలను కూడా చూపిస్తుంటారు. కరాటే, వంట చేయడం అంటే అక్షయ్‌కు ఇష్టం. అయితే తాజాగా అక్షయ్ తనలోని మరో ప్రతిభను భయటపెట్టారు. ఈ సారి తనలోని ఫొటో గ్రాఫర్‌ను కూడా మేల్కొలిపారు. ప్రస్తుతం అక్షయ్ బచ్చన్ పాండే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్షయ్ సరసన కృతి సనన్ నటిస్తున్నారు. ఇటీవల కృతి తన ఇస్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేశారు. అంతేకాకుండా బచ్చన్ పాండే సెట్స్ నుంచి, ఈ ఫొటోను అక్కి కాప్చర్ చేశారంటూ రాసుకొచ్చారు. ఆ ఫొటో ఫోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే వేల వ్యూస్, కామెంట్లు వచ్చాయి. కృతి బచ్చన్ పాండే సెట్లో ఉన్నప్పుడు అక్షయ్ ఈ పొటోను తీశారు. ఇందులో కృతి ముఖంపై ఎండా, నీడా పడుతూ ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఫొటో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఫొటోకు బచ్చన్ పాండే నిర్మాత సజిద్ నడియాడ్వాలా భార్య వార్దా గార్జియస్ అంటూ స్పందించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram