బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు అక్షయ్ కుమార్. బాలీవుడ్ లో సంవత్సరానికి మినిమమ్ నాలుగు నుంచి ఐదు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేష్ దాదాపుగా రూ. 35 కోట్ల వరకు ఉంటుంది. దీంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటారట.
అక్షయ్ తో సినిమా అంటే ఎక్కువ ఖర్చే. కానీ, మంచి లాభాలు వస్తున్నాయి కాబట్టి అక్షయ్ తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. దీంతో పాటు అక్షయ్ దాదాపు 20 ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. మొత్తమ్మీద సంవత్సరానికి దాదాపుగా రూ. 444 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సెలెబ్రిటీస్ మ్యాగజైన్ పేర్కొంది. ఇండియా నుంచి టాప్ లిస్ట్ లో ఉన్న సెలెబ్రిటీ నటుడు అక్షయ్ కుమార్ ఒక్కరే కావడం విశేషం. ఈ లిస్ట్ లో వరల్డ్ లో టేలర్ స్విఫ్ట్ టాప్ పొజిషన్ లో ఉండగా, అక్షయ్ 35 వ స్థానంలో ఉన్నాడు.