HomeTelugu Trendingఅక్షయ్‌కుమార్‌ తల్లి కన్నుమూత

అక్షయ్‌కుమార్‌ తల్లి కన్నుమూత

Akshay kumar mother passes

బాలీవుడ్‌ అగ్ర నటుడు అక్షయ్‌కుమార్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా (80) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమెను సెప్టెంబర్‌ 3న ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు అక్షయ్‌ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్‌ పెట్టారు.

‘మా అమ్మ అరుణ భాటియా నేటి ఉదయం ఈలోకాన్ని విడిచిపెట్టారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలవనున్నారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వల్ల నాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి’ అని అక్షయ్‌ పేర్కొన్నారు. అరుణ భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సంతాపం ప్రకటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu