బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఐదు పదుల వయసులోనూ తన ఫిట్నెస్, శరీరాకృతితో ఫ్యాన్స్‌ను అబ్బుర పరుస్తున్నాడు. తనలాగే.. తన అనుచరులు, అభిమానులు కూడా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారాయన. ఇందులో భాగంగా ఆయన చేసే వ్యాయామాల వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తుంటారు. తాజాగా అక్షయ్ ఓ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. దాని పేరే.. ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’. తన రోల్‌మోడల్ అయిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జేసన్ స్టాథమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇంతకీ ఈ ఛాలెంజ్ ఏంటంటే.. ఓ టేబుల్‌పై బాటిల్ పెట్టాలి. దాని మూతను బాటిల్‌కు పూర్తిగా తిప్పి పెట్టకూడదు. కొద్దిదూరంలో నిలబడి కాలితో బాటిల్ క్యాప్‌ను తన్నాలి. అయితే ఈ ప్రక్రియలో ఆ బాటిల్ కిందపడకూడదు. ఈ ఛాలెంజ్‌లో అక్షయ్ విజయవంతం అయ్యారు. అంతేకాదు దీనిలో పాల్గొన్న తొలి భారతీయ నటుడు ఆయనే కావడం విశేషం. అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలని అక్షయ్ పిలుపునిచ్చారు.
I couldn't resist 😉#BottleCapChallenge
Inspired by my action idol #JasonStatham, I will repost/retweet the Best I see, come on Guys and Girls get your Bottle out and your Legs in the Air, Let's Do This 💪🏽 #FitIndia #WednesdayMotivation pic.twitter.com/RsDYDWhS5n
— Akshay Kumar (@akshaykumar) July 3, 2019