బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన పేరిట ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబర్‌పై అక్షయ్ పరువు నష్టం దావా వేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో తన పేరును వాడి తప్పుడు ప్రచారం చేస్తున్న రషీద్ సిద్ధిఖీ అనే యూట్యూబర్‌పై 500 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇక, కొన్ని నెలల కిందట రషీద్.. ఇదే కేసుకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేర్లను లాగినందకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఒక సందర్భంలో.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఎంస్ ధోని.. అన్‌టోల్డ్ స్టోరి వంటి పెద్ద సినిమాలు దక్కడంపై అక్షయ్ చాలా బాధపడుతున్నాడని ప్రచారం చేయశాగాడు. అదే కేసుకు సంబంధించి ఆదిత్య ఠాక్రే, ముంబై పోలీసులతో రహస్య చర్చలు జరిపాడని ఆరోపించాడు. అంతేకాకుండా సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి కెనడా పారిపోయే ప్రయత్నాలకు సాయం అందించాడని కూడా ప్రచారం చేశాడు. అతడిపై పరువు నష్టం, ఉద్దేశపూర్వకంగా అవమానించిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటువంటి ప్రచారం కారణంగా కేవలం నాలుగు నెలల కాలంలో రషీద్ నడుపుతున్న యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రిప్షన్ రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెరిగిందని, అంతేకాకుండా అతడు 15 లక్షలు సంపాదించాడని సమాచారం.