నటి అక్షర హాసన్ హాట్ ఫొటోస్ లీక్ వ్యవహారంపై పోలీసులు విచారణ కొనసాగుతూ ఉంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు మీడియా కొన్ని కొత్త పేర్లను వెలుగులోకి తీసుకొస్తూ ఉండటం విశేషం. లీకైన ఫొటోలను బట్టి చూస్తే వాటిని అక్షర తనకు బాగా కావాల్సిన వారి కోసం షేర్ చేసినట్టుగా స్పష్టం అవుతోంది. ప్రేమలో ముదిరిపోయిన వారు ఇలాంటి హాట్ పిక్స్ ను షేర్ చేసుకోనూ వచ్చు. అక్షర పిక్స్ కూడా దాదాపు అలానే ఉన్నాయి. అయితే అవి ఏవో ఫొటో షూట్ సందర్భంగా తీసినవి అని అక్షర అంటోందట. అక్షర పొలిస్ ఈ విషయంపై కంప్లైంట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారని సమాచారం. అక్షర ఈ ఫొటోలను ఎవరితో షేర్ చేసుకునే అవకాశం ఉందో గ్రహించి అటు వైపు నుంచి విచారణ చేస్తున్నారు.
అక్షర బాయ్ ఫ్రెండ్స్ ను ఈ వ్యవహారంలో విచారణ చేస్తున్నారని సమాచారం. అలాగే ఈ వ్యవహారంలో నటి రతి అగ్నిహోత్రి తనయుడు తనూజ్ పేరు కూడా వినిపిస్తోంది. అక్షర, తనూజ్ లో గతంలో రిలేషన్ షిప్ లో ఉండేవారట. ఆ రిలేషన్ షిప్ ఎప్పుడో బ్రేకప్ కూడా అయ్యిందట. బహుశా అక్షర అతడికి ఈ పిక్స్ ను షేర్ చేసి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు తనూజ్ను మీడియా సంప్రదించింది. అలాంటి ఫొటోలు వెలుగులోకి రావడం చాలా అన్ లక్కీ అని చెప్పిన తనూజ్.. ఆ ఫొటోలు ఎప్పుడూ తన వద్దలేవని చెప్పాడు. తన దగ్గర ఆ ఫొటోలే లేనప్పుడు తను ఎలా లీక్ చేస్తానని అన్నాడు.