HomeTelugu Trendingవిడాకుల తర్వాత నాగచైతన్య తొలిపోస్ట్

విడాకుల తర్వాత నాగచైతన్య తొలిపోస్ట్

Akkineni Naga chaitanya fir
టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య భార్య సమంత తో విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్‌ మీడియాల్లో యాక్టివ్‌గా కనిపించలేదు. 45 రోజుల విరామం తరువాత.. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిపోస్ట్‌ చేశారు. అమెరికన్ హాలీవుడ్‌ నటుడు మాథ్యూ మెకన్‌హే రచించిన ‘గ్రీన్‌ లైట్స్‌’అనే ఆటోబయోగ్రాఫ్రి చదివిన చైతూ.. ‘‘జీవితానికి ప్రేమ లేఖ.. గ్రీన్‌లైట్స్‌’’ అని అభివర్ణించారు. రచయిత మాథ్యూని ట్యాగ్‌ చేస్తూ.. మీ ఆత్మకథని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జీవితంలో ముందుకు వెళ్లేందుకు నాకు ఈ పుస్తకం ఉపయోగపడింది. ఇలాంటి పుస్తకం రచించినందుకు మీకు గౌరవవందనాలు సర్‌!’’ అంటూ కొనియాడారు.

వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేటుగా ఉంచేందుకు ఇష్టపడే చైతూ.. సోషల్‌మీడియాలో పోస్టింగ్స్‌ చేయడం ఇష్టం ఉండదని గతంలో సమంత నిర్వహించిన సామ్‌- జామ్‌ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్‌ కార్లు, బైక్‌ రైడింగ్‌ని అమితంగా ఇష్టపడే చై.. తొలిసారి జీవితానికి సంబంధించిన పుస్తకం గురించి చర్చించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చైతన్య బంగ్రార్రాజు, థాంక్యూ చిత్రాలతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఓటీటీల్లోనూ అడుగుపెట్టనున్నారు. విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో ఓ హారర్‌ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu