అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం ఈరోజు జీవీకే హౌస్ లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ ఈ నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులు, కోడళ్ళతో దిగిన ఫోటో హైలైట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. అక్కినేని అఖిల్, శ్రేయా భూపాల్ ల జంటను ఆశీర్వదించడానికి అన్నట్లుగా నాగచైతన్య, సమంతలు వేదికపైకి వెళ్లారు. వీరి నలుగురి మధ్యలో నాగార్జున నుంచోని ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.