HomeTelugu Newsరైతులకు సాయం చేసిన అక్కినేని అమల

రైతులకు సాయం చేసిన అక్కినేని అమల

12 4అక్కినేని అమల.. రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో సర్పంచి విష్ణువర్ధన్‌ రెడ్డి ఆధ్వర్యంలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలను అందజేశారు. ఒక్కో రైతుకు సుమారు 4కిలోల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ… సేంద్రియ వ్యవసాయ విధానంలో పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. ఈ విధానంపై రైతులు ఆసక్తితో ముందుకు వస్తే నిపుణులైన శాస్త్రవేత్తలను పాపిరెడ్డిగూడకు పిలిపించి అవగాహన కల్పించనున్నట్లు అమల పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్‌ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమల ఆకాంక్షించారు. అమల కేవలం నాగార్జున భార్యగానే కాకుండా బ్లూక్రాస్‌ హైదరాబాద్‌ కో ఫౌండర్‌గా వ్యవహరిస్తుంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu