HomeTelugu Trendingపెళ్ళి విషయంలో నాగ చైతన్య ను ఫాలో అవుతున్న Akkineni Akhil?

పెళ్ళి విషయంలో నాగ చైతన్య ను ఫాలో అవుతున్న Akkineni Akhil?

Akkineni Akhil wedding plans surprises the fans!
Akkineni Akhil wedding plans surprises the fans!

Akhil Akkineni wedding plans:

నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని తన ప్రేయసి జైనాబ్ రవ్జీతో 2024 నవంబర్ 26న నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ ప్రయాణం పలు ఏళ్లుగా కొనసాగుతుండగా, చివరికి పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. మార్చి 24, 2025న వీరి వివాహం జరగనుందని సమాచారం.

అఖిల్ పెళ్లి హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ స్టూడియోలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం కూడా గతంలో జరిగింది. కుటుంబానికి ఈ ప్రదేశం ప్రత్యేకమైన భావోద్వేగాన్ని కలిగిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

ఇంకా, ఈ జంట గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాగ చైతన్య లాగా అఖిల్ కూడా తన పెళ్లిని సన్నిహితుల మధ్య, కుటుంబ సభ్యుల సమక్షంలో జరగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: Dil Raju హైదరాబాద్ ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu