Akkineni Akhil: మిగతా స్టార్ కిడ్ లతో పోలిస్తే అక్కినేని అఖిల్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ స్టార్ కిడ్ అయినా ఇండస్ట్రీలోకి వచ్చి రెండు మూడు సినిమాలు చేశాక అభిమానులు ఏర్పడతారు. కానీ అక్కినేని అఖిల్ విషయంలో మాత్రం మొదటి నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.
నాగార్జున నటించిన సిసింద్రీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించినప్పటి నుంచి అఖిల్ కి చాలామంది అభిమానులు ఏర్పడిపోయారు. ఎప్పుడు అఖిల్ ఇండస్ట్రీకి పరిచయం అవుతాడా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక మనం సినిమాలో అఖిల్ చిన్న క్యామియో పాత్రలో కనిపించిన తరువాత అఖిల్ కి స్టార్ హీరో రేంజ్ స్టేటస్ వచ్చేసింది.
అదే జోరుతో అఖిల్: ది పవర్ ఆఫ్ జువా అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. కానీ మొదటి సినిమాతోనే మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత వరుసగా ఐదు సినిమాలు చేశాడు కానీ ఒక్కటి కూడా మంచి హిట్ అవ్వలేదు. ఇక 2023లో విడుదలైన ఏజెంట్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఏజెంట్ సినిమా పై వచ్చినంత ట్రోలింగ్ ఇంకా మరే సినిమా పైన వచ్చి ఉండదు. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక చిత్ర బృందం సినిమాని ఓటీటీలలో కూడా విడుదల చేయకుండా దాచేసింది. అయితే ఒకవైపు నాగచైతన్య మాత్రం మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు దూసుకు వెళుతుండగా అఖిల్ మాత్రం ఎందుకు వెనకబడిపోతున్నాడు అని చాలామంది చర్చించుకుంటూ ఉంటారు.
Akkineni Akhil:
అక్కినేని నాగచైతన్య తో పోలిస్తే అఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా వేరుగా ఉంటుంది. కెరీయర్ మొదలైన కొత్తలో నాగచైతన్య 100% లవ్, ఏ మాయ చేసావే ఇలా రొమాంటిక్ ప్రేమ కథలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తరువాతే భారీ బడ్జెట్ సినిమాలు జోలికి వెళ్ళాడు.
కానీ అఖిల్ మాత్రం మొదటి సినిమా నుంచి భారీ బడ్జెట్లతో సినిమాలు తీస్తున్నాడు. కొంచెం తేడా కొట్టగానే సినిమాలు డిజాస్టర్ గా మారుతున్నాయి. నాగచైతన్య ముందు మినిమం గ్యారెంటీ హీరో ట్యాగ్ తెచ్చుకున్నాకే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ కనీసం హీరోగా కూడా పేరు తెచ్చుకోకుండానే అఖిల్ భారీ బడ్జెట్ సినిమాలతో కెరీయర్ ను పాడు చేసుకున్నాడు.
అయితే ఇప్పటికీ అఖిల్ కి మించిపోయింది లేదు. కరెక్ట్ గా ఒక రెండు మూడు మంచి హిట్లు పడితే అఖిల్ కూడా మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడు. మరి తన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఇప్పటికైనా అఖిల్ తన నిర్ణయాలు మార్చుకొని ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీస్తాడో లేదో వేచి చూడాలి.