అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా ‘అఖిల్’ ఫ్లాప్ కావడంతో తదుపరి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకొని ఫైనల్ గా దర్శకుడు విక్రమ్ కె కుమార్ ను ఎన్నుకున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం హాలీవుడ్ నుండి కొరియోగ్రాఫర్స్ ను రంగంలోకి దించారు. ఒక్క యాక్షన్ సీక్వెన్సెస్ కోసం దాదాపు 12 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారు. దీంతో ఇదొక పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ అని.. ప్రయోగాత్మక కథలు చేసే విక్రమ్ తొలిసారి తన జోనర్ ను మార్చుకొని యాక్షన్ ను ఎన్నుకున్నారనే ప్రచారం ఊపందుకుంది.
అయితే ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కాదని రొమాంటిక్ లవ్ స్టోరీ అని వెల్లడించాడు అఖిల్. అంతేకాదు ఈ సినిమా విక్రమ్ స్టయిల్ లో ఉండే ప్రయోగాత్మక సినిమా అని తెలిపాడు. సినిమాలో యాక్షన్ ఒక పార్ట్ మాత్రమే అని ఆ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని అన్నారు. సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ కు మరింత ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు. విక్రమ్ తనలోని కొత్త విషయాలను తెరపై ఆవిష్కరించనున్నాడని, తనతో కలిసి పని చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని అన్నారు. మొత్తానికి అదన్నమాట మేటర్ ఇది యాక్షన్ ఎంటర్టైనర్ కాదు, మంచి రొమాంటిక్ స్టోరీ..