అక్కినేని అఖిల్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశాడు. వీడెవడు మీరు గెస్ చేయగలరా..? అంటూ ఇతను నా టీంమెట్ అంటూ ఓ క్లూ కూడా ఇచ్చాడు. ఆ పోస్టర్ లో వెనుక నుండి గన్ పట్టుకొని ఉన్న వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ పోస్టర్ మొత్తం ప్రిజనర్, లయర్, లవర్, హీరో, మర్డరర్ ఇలా గజిబిజిగా పదాలతో నింపేశారు. అఖిల్ టీంమెట్ అనేసరి అందరూ నితిన్ అని గెస్ చేయడం మొదలుపెట్టారు. నితిన్ చేసింది ఒక్కటే సినిమా కాబట్టి టీంమెట్ అంటే నితిన్ అయి ఉంటాడని అంటున్నారు.
పైగా నితిన్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేస్తుండడం.. అందులో తను పాతబస్తీ కుర్రాడి పాత్రలో కనిపిస్తున్నాడని తెలియడంతో ఈ పోస్టర్ లో ఉన్నది నితిన్ అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ విషయం తెలియాలంటే ఫిబ్రవరి 14 వరకు ఎదురుచూడాల్సిందే..