అఖిల్ పై మరో న్యూస్!
గత కొంతకాలంగా అఖిల్ రెండో సినిమాపై రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. మొదట వంశీ పైడిపల్లితో,
తరువాత హను రాఘవపూడితో చేస్తున్నాడని మాటలు వినిపించాయి. కానీ ఇద్దరు దర్శకులు
తప్పుకున్నారు. ఆ తరువాత మారుతి పేరు వినిపించింది. అది కాకుండా విక్రమ్ కె కుమార్ తో
ఈసారి పక్కా సినిమా ఉంటుందని మరో వార్త హల్ చల్ చేసింది. కానీ ఇవేమీ కాకుండా ఇప్పుడు
అఖిల్ ఓ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. నాగార్జున కెరీర్ లో చెప్పుకోదగ్గ
చిత్రాలలో మన్మధుడు సినిమా ఒకటి. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అఖిల్ తో చేయించాలని నాగ్
భావిస్తున్నాడట. అలా చేస్తే కచ్చితంగా అఖిల్ కి హిట్ వస్తుందనే నమ్మకం. దీనికోసం త్రివిక్రమ్
ను రంగంలోకి దింపాలనేది నాగ్ ఆలోచన. అంతా బానే ఉంది.. కాని త్రివిక్రమ్ ఒప్పుకుంటాడో
లేదో చూడాలి!