తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో అఖిల్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యాడు. అతని స్నేహితులే అతని వెనుపోట్టు పోడిచారు. అర్ధరాత్రి ఇంటిసభ్యులను నిద్ర లేపిన బిగ్‌బాస్ అందరినీ బ్యాగు సర్దుకోమని ఆదేశించాడు. అనంతరం ఫినాలే వరకు సాగే మీ ప్రయాణంలో ఎవరు మీకు అడ్డుపడతారని భావిస్తారో ఆ వ్యక్తి పేరును ఏకాభిప్రాయంతో తెలియజేయాలని, అతడు తక్షణమే హౌస్‌ను వీడి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో అందరు ఆలోచనలో పడ్డారు. అభిజిత్ తప్ప మెజారటీ సభ్యులు అఖిల్ పేరును వెల్లడించారు. దీంతో అఖిల్‌కు ఎక్కువ ఓట్లు పడటంతో అతడు హౌస్ నుంచి నిష్క్రమించాడు. ఇది ఊహించని అతడు కన్నీళ్లు ఆపుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. మొదటి సారి ఏకాభిప్రాయంతో నన్ను సెలక్ట్ చేసుకున్నారు అంటూ తన బాధను చెప్పుకునేందుకు మాటలు వెతుక్కున్నాడు.
సోహైల్, మోనాల్ కన్నీళ్ల పర్యంతం అవగా అభిజిత్ మాత్రం కనీసం దగ్గరకు కూడా వెళ్లలేదు. అఖిల్ లాగే సోహైల్, మోనాల్ గేమ్ ఈజ్ గేమ్ అని ఆలోచించారు. కానీ స్ట్రాంగ్ అని చెప్తూనే తన ఫ్రెండ్‌ని బయటకు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని లాస్య, అభి, హారిక.. మోనాల్ తీరుపై చర్చించుకున్నారు. తామైతే అలా చేయలేమని అభిప్రాయపడ్డారు. మరోవైపు అఖిల్ ఫేక్ ఎలిమినేషన్‌తో నేరుగా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లాడు. ఈ అవకాశం లభించినందుకు ఆనందించిన అఖిల్ ఇప్పుడు తనకు క్లారిటీ దొరుకుతుందని భావించాడు. కానీ అక్కడ హౌస్‌లో మాత్రం మోనాల్, సోహైల్ చంటిపిల్లల్లా ఏడ్చారు. ఇక తర్వాతి రోజు నుంచి ఇంట్లో ఏం జరుగుతుందనేది అఖిల్ టీవీలో చూశాడు. మోనాల్ అఖిల్ ని తలుచుకుని కన్నీళ్లు పెటుకోవడం చూసి ఫీలయ్యాడు. అఖిల్ వెళ్లిపోయాక ఇల్లు చాలా సైలెంట్‌గా అయిపోయిందని మోనాల్ వెలితిగా ఫీలవుతుంటే తనకు మాత్రం ఎప్పటిలాగే ఉందని అభి కౌంటరిచ్చాడు.
ఇదిలా ఉంటే మోనల్ పై సోషల్ మీడియాలో అఖిల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మోనల్ వల్ల అఖిల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని, గతంలో పునర్నవి, రాహుల్ మధ్య ఉన్న కెమిస్ట్రీ వీరిద్దరి మధ్య కనిపించకపోయినా, మోనల్ మాత్రం ప్రేమ అంటూ అవసరం ఉన్నా, లేకున్నా హగ్గులతోనూ, కిస్సులతో రెచ్చిపోయింది. ఇక అఖిల్ పొరిగింట్లో ఉన్న సమయంలో చూస్తున్నాడన్న సంగతి గ్రహించిన మోనల్ మరింత ఓవర్ యాక్షన్ చేస్తుంది. అఖిల్ పడుకున్న బెడ్ మీద ఉన్న దిండును ముద్దాడుతూ రెచ్చిపోయింది. నిజానికి మోనల్ కేవలం అఖిల్ తో చేస్తున్న రొమాన్స్ వల్లనే ఇంకా హౌస్ లో ఉందని లేకుంటే ఎప్పుడో ఎలిమినేట్ అయేది అని అంటున్నారు. ఇకనైన అఖిల్ నిజం గ్రహించి మోనల్ ను అవాయిడ్ చేసి టాస్క్‌ల పై దృష్టి చేస్తే మంచిదని భావిస్తున్నారు.