అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటి వరుకు మూడు సినిమాలు చేశాడు .’అఖిల్, హలో, మిస్టర్ మజ్ను” కానీ ఈ సినిమాలతో ఆశించిన గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ మేరకు న్యూ అండ్ క్రేజీ లుక్ లోకి మారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో సినిమాలో నటిస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పేరుతో రూపొందుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం కానుంది. ఇక కరోనా ఎఫెక్ట్‌తో ఈ సినిమా విడుదల డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. దీంతో ఇటీవల ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తారంటూ వార్తలొచ్చినప్పటికీ, వాటిలో నిజం లేదని తెలుస్తోంది. అయితే దసరా నాటికి ఈ కరోనా మహమ్మారి తగ్గుమొఖం పడుతుందా లేదా అన్నది చూడాలి.