అఖిల్ హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా రానుంది. ఈ విషయాన్ని
నాగార్జున ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇప్పటికే కథ సిద్ధంగా ఉందని.. త్వరలోనే ఈ సినిమా సెట్స్
మీదకు వెళ్లనుందని చెప్పారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరని తీసుకోవాలా.. అని
ఆలోచిస్తున్న సమయంలో నివేదా థామస్ అయితే బావుంటుందని ఆలోచిస్తున్నారు. ‘జెంటిల్ మెన్’
సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నివేదా. గ్లామర్ పరంగా కూడా మంచి
మార్కులే కొట్టేసింది. యూత్ లో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో నివేద అయితే అఖిల్
సినిమాలో పెర్ఫెక్ట్ అని భావించి ఆమెను సంప్రదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అఖిల్ హీరో,
విక్రమ్ కుమార్ డైరెక్షన్ అంటే అమ్మడు ఒప్పుకోకుండా ఉండదు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్
సంగీతం అందించనున్నారు.