పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన ‘సలార్’ మూవీ ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో అక్కినేని యంగ్ హీరో అఖిల్ కనిపించడం ఓ ఆసక్తికర పుకార్లకు తావిచ్చింది.
సలార్ సీక్వెల్ సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం మూవీలో అఖిల్ నటించబోతున్నాడని, అందుకే మూవీ టీమ్ తో ఫస్ట్ పార్ట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నారు. సలార్ గతేడాది డిసెంబర్ 22న రిలీజై ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు మూవీ టీమ్ చెబుతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 16) సలార్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి ఈ మూవీలో నటించిన ప్రభాస్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావుతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రొడ్యూసర్స్ అందరూ హాజరయ్యారు.
వీరితో పాటు అఖిల్ కూడా ఆ సెలబ్రేషన్స్ లో కనిపించడంఈ వార్తలను దారితీసింది. అఖిల్ కు ఈ సెలబ్రేషన్స్ తో సంబంధం ఏంటన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే సలార్ సీక్వెల్లో అఖిల్ నటించబోతున్నాడన్న వార్తలు మొదలయ్యాయి.
మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి దేవా తమ్ముడి పాత్రలో అఖిల్ కనిపించబోతున్నాడు అంటున్నారు. గతేడాది ‘ఏజెంట్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ మరో సినిమా చేయలేదు. తన తర్వాతి సినిమా షూటింగ్ లో భాగంగా సెట్స్ లో అఖిల్ తన చేతికి గాయం చేసుకున్నట్లు తెలిసింది. ఆ కట్టుతోనే అతడు ఈ సెలబ్రేషన్స్ కు వచ్చాడు. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే అఖిల్ కెరీయర్‌కు ప్లస్ అవుతుంది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.