HomeTelugu Trendingమోహన్ లాల్‌ కోడలు కాబోతున్న అఖిల్‌ హీరోయిన్‌.!

మోహన్ లాల్‌ కోడలు కాబోతున్న అఖిల్‌ హీరోయిన్‌.!

9 2టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్‌ సమంత అక్కినేని. ఏమాయ చేశావే చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన సమంత పలు విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడటం.. ఆ తరువాత అతడిని పెళ్లి చేసుకోవడం వెంట వెంటనే జరిగాయి. ప్రస్తుతం ఈ అక్కినేని కోడలు ఇటు కెరీర్, అటు ఫ్యామిలీ రెండింటిని విజయవంతంగా దుసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సమంత బాటలోనే అఖిల్ బ్యూటీ కూడా వెళుతోందట. హలో మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టీ కల్యాణి ప్రియదర్శన్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు, హీరో ప్రణవ్ లాల్‌తో కల్యాణి పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్(కల్యాణి ప్రియదర్శన్ తండ్రి)మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. మోహన్ లాల్‌తోనే ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన ప్రియదర్శన్.. ఆయనకు ఎన్నో హిట్లను కూడా ఇచ్చారు. దీంతో వీరిరువురి కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఇక ప్రణవ్ లాల్, కల్యాణి ప్రియదర్శన్‌లు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. తనకు ప్రణవ్ బెస్ట్ ఫ్రెండ్ అని కల్యాణి కూడా పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇక వీరిద్దరు సాన్నిహిత్యంగా ఉన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయగా.. వీరి ప్రేమపై ఇదివరకు కూడా చాలా సార్లు వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వాటన్నింటిని ఈ ఇద్దరు ఖండిస్తూ వచ్చారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారట. ఈ మధ్యనే ఈ ఇద్దరు తమ సినీ కెరీర్‌ను ప్రారంభించగా.. కెరీర్‌లో కాస్త సెటిల్ అయిన తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటన్నారట. మరి ఇప్పుడొచ్చిన వార్తల్లో ఎంతనిజముందో తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా మోహన్ లాల్‌తో ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ‘మరక్కర్’ అనే చిత్రంలో ఈ ఇద్దరు కెమెరా అప్పియరెన్స్ ఇవ్వనుండగా.. మరో మూవీలో ప్రణవ్, కల్యాణి కలిసి నటించబోతున్నారు.

9a 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu