నాగచైతన్య, సమంతల ప్రేమ విషయంలో ఓ క్లారిటీ వచ్చేలోపే అఖిల్ కూడా తను ప్రేమలో
ఉన్నట్లుగా వెల్లడించారు. అంతేకాదు తను ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పి అందరినీ
ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ అమ్మాయి వివరాలు గోప్యంగా ఉంచాలని భావించినా..
తనెవరో తెలిసిపోయింది. శ్రేయా భూపాల్ అనే డిజైనర్ తో అఖిల్ ప్రేమలో ఉన్నాడనేది
సమాచారం. ఆ వార్తల్లో నిజం లేకపోతే అఖిల్ ఖండించేవాడు కానీ అలా చేయలేదు..
దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ ఏడాదిలో చైతుతో పాటు
అఖిల్ వివాహం కూడా చేయబోతునట్లు వార్తలు వినిపించాయి. చైతు విషయం ఎలా
ఉన్నా.. అఖిల్ మాత్రం తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి రెడీ అయిపోయాడు. ఈ సంవత్సరం డిశంబర్ 9న
నిశ్చితార్ధం చేసుకొని… వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయం అఖిల్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమాల విషయంలో స్లో..గా
ఉన్నప్పటికీ ప్రేమ విషయంలో మాత్రం ముందడుగులు వేస్తున్నాడు అఖిల్.