
Akhil Akkineni wedding:
అక్కినేని అఖిల్ సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా, ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ లో ఆయనకి ఉన్న క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు.
గత ఏడాది నవంబర్ 26న అఖిల్, జైనబ్ రావ్డ్ తో నిశ్చితార్ధం జరుపుకున్నారు. ఇది చాలా ప్రైవేట్ వేడుకగా కుటుంబ సభ్యులు మధ్య మాత్రమే జరిగింది. అఖిల్ ముందుగా శ్రియా భోపాల్ తో గ్రాండ్ ఎంగేజ్మెంట్ జరిగింది కానీ, జైనబ్ తో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇది కూడా నాగార్జున ఫోటోలు షేర్ చేసిన తరువాతే బయటకు వచ్చింది.
ఇప్పుడు అఖిల్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, అఖిల్-జైనబ్ ల పెళ్లి వచ్చే మార్చి 24న జరగనుందని టాక్. ఈ పెళ్లి విదేశాల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగగా, ఇండియాలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
జైనబ్ రాజకీయ నాయకుల కుటుంబానికి చెందినవారని, ముఖ్యంగా వైఎస్ జగన్ కి సన్నిహితురాలని టాక్. అంతే కాదు, ఆమె అఖిల్ కంటే 11 ఏళ్లు పెద్దది. కానీ వీరి ప్రేమకి వయస్సు అడ్డురాలేదు. అఖిల్ మొదట అఖిల్ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాల్లో నటించాడు. ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే విజయం సాధించగా, మిగతా చిత్రాలు నిరాశ కలిగించాయి.