అఖిల్ అక్కినేని కెరీర్‌లో సాలిడ్ హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు అఖిల్ 5 సినిమాలు చేసినప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ మాత్రమే కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అఖిల్ మొదటి సినిమా, తాజాగా వచ్చిన ఏజెంట్ మూవీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. మిగిలిన రెండు సినిమాలు ఎవరేజ్.
యూవీ క్రియేషన్స్ ఒక ఫిక్షనల్ ఫాంటసీ కథతో అఖిల్ కి హిట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. అఖిల్ అక్కినేని బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకోవడానికి మరో ప్రయత్నం చేయబోతున్నాడు. కథ డిమాండ్ మేరకు ఎలా కనిపించడానికైనా సిద్ధంగా ఉన్నాడు.
ఈ సినిమాతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ పరిచయం కాబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా అఖిల్ ఆరో మూవీ. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ టీజర్