HomeTelugu Trendingస్టన్నింగ్‌ పోస్టర్‌తో 'ఏజెంట్‌' షూటింగ్ అప్డేట్

స్టన్నింగ్‌ పోస్టర్‌తో ‘ఏజెంట్‌’ షూటింగ్ అప్డేట్

Agent shooting update

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో ‘ఏజెంట్‌’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్‌ని కొత్తగా చూపించనున్నాడు దర్శకుడు. ఈ నేపథ్యంలో అఖిల్ కు సంబంధించిన ఓ స్టన్నింగ్ పోస్టర్ తో సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైందని చిత్ర యూనిట్ ప్రకటించారు. ”ది కిల్లర్ అఖిల్ అక్కినేని & స్టన్నర్ సురేందర్ రెడ్డి సూపర్ ఛార్జ్ తో యాక్షన్ మొదలుపెట్టారు. మెటిక్యులస్ ప్లానింగ్ & ఇంటెన్స్ ట్రైనింగ్ తరువాత మా #AGENT షూటింగ్ ఈరోజు ప్రారంభమవుతుంది” అని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్ 8 ప్యాక్‌తో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ‘సాక్షి వైద్య’ ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్.

అఖిల్ ‘ఏజెంట్’ న్యూ లుక్ విడుదల

Recent Articles English

Gallery

Recent Articles Telugu