నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ’. ఈ సినిమాపై అటు చిత్ర పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది. పోస్టర్లు, టైటిల్ గీతం విశేషంగా ఆకట్టుకోవడంతో ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం ఆ కానుకను అందించింది. ‘అఖండ రోర్’ పేరుతో ఆదివారం ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ బాలకృష్ణ అభిమానులకు ఆకట్టుకుంటుంది. సినిమాపై ఉన్న అంచనాల్ని మరింత పెంచేలా ఉంది. బాలకృష్ణ లుక్స్, ఆయన చెప్పిన డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.