HomeTelugu News'ఓటీటీ'లో పూరీ రొమాంటిక్‌ మూవీ!

‘ఓటీటీ’లో పూరీ రొమాంటిక్‌ మూవీ!

9 21

కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. దాదాపు చిన్న సినిమాలు అన్నీ ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక పూరీ జగన్నాథ్ తన కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా ‘రొమాంటిక్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీని కోసం కథ – స్క్రీన్ ప్లే – మాటలు అందించి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి దర్శకత్వ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాని పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ జగన్నాథ్ – చార్మీ కలిసి నిర్మించారు. ఈ నేపథ్యంలో ‘రొమాంటిక్’ సినిమాని కూడా నేరుగా ఓటీటీ విడుదల చేయడానికి పూరీ ప్లాన్ చేస్తున్నాడట. తాజాగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వారు పూరీతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘రొమాంటిక్’ లాంటి సినిమా ఇప్పుడున్న పిరిస్థితులను బట్టి ఓటీటీ రిలీజ్ చేస్తేనే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ‘మెహబూబా’ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఎలాగైనా తనయుడికి ‘రొమాంటిక్‌’ హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడు పూరీ..

Recent Articles English

Gallery

Recent Articles Telugu