దర్శకుడు పూరీ జగన్నాథ్.. కొడుకు ఆకాష్ పూరీ నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్ . ఆకాష్‌కు హిట్ లేకపోవడంతో.. తానే కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసి కొత్త దర్శకుడు అనిల్ పాడూరికి ఆ భాధ్యతలు అప్పగించాడు. ఈ సినిమాకు రొమాంటిక్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు. ఇప్పుడు ఈ చిత్రంలోని బీచ్ సాంగ్ విడుదలైంది.
ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఆకాష్‌కు జోడీగా ముంబై ముద్దుగుమ్మ కేతికా శర్మ నటిస్తుంది. ఈ భామ కూడా పూర్తిగా అందాల ఆరబోతకు రెడీ అంటుంది. ఇప్పుడు విడుదలైన వీడియోలో కూడా ఈ బ్యూటీ.. తెగ రెచ్చిపోయింది. పూర్తిగా బీచ్ అందాల మధ్య అన్నీ ఆరబోసింది ఈ ముంబై కేతికా. ఏకంగా క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది ఈ భామ.
ఈ వీడియో ఇప్పుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ కాదు.. వీడియో కూడా రొమాంటిక్ కాదు.. హాట్‌గా ఉంది. యూత్ టార్గెట్‌గా ఈ చిత్రం విడుదలవుతుంది. రొమాన్స్ ఎప్పటికీ చాలా ఘాటుగా ఉంటుందంటూ పూరీ ట్వీట్ చేసాడు. ఈ సినిమాను ఛార్మితో కలిసి పూరీ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.