టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగాతెరకెక్కుతోన్న రెండో చిత్రం ‘రొమాంటిక్’ ఫస్ట్‌లుక్ విడుదలైయింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న తొలిచిత్రంలోనే ఫస్ట్‌లుక్‌లో అందాల ఆరబోతతో ఆదరగొట్టింది. స్టన్నింగ్ ఫోటోతో కుర్రకారుల మతిపోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్‌లుక్ విడుదలైన కొద్ది సమయంలో సోషల్ మీడియాలో ఈ ఫోటో చెక్కర్లుకొడుతోంది. చాలామంది నెటిజన్లు, చిత్ర ప్రముఖులు ఈ ఫోటోపై స్పందిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారంటే ఈమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందాలను తెగ ఆరబోస్తూ ఫొటోషూట్లు చేస్తూ ఉంటుంది. ఇంత హాట్ బ్యూటీని వెతికిపట్టుకుని తన కొడుకు పక్కన హీరోయిన్‌ను చేసేశారు పూరి.
ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి చిత్రం. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ‘రొమాంటిక్’ షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.