‘జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడూ లేడు. ఒకసారి నవ్వని పేదవాడూ లేడు’ అంటున్నారు అజిత్. శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన మూవీ ‘విశ్వాసం’. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో అదే పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.
అజిత్ యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు పాత్రల్లో అదరగొట్టేశారు. శివ గత సినిమాల్లో ఉండే యాక్షన్ ఘట్టాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇందులో ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ‘పేరు: వీర్రాజు, గోదావరి జిల్లా, ఊరు: రావులపాలెం, పెళ్లాం పేరు: నిరంజన, కూతురి పేరు: శ్వేత దమ్ముంటే రారా’ అంటూ చివర్లో అజిత్ విసిరే సవాల్ ఆకట్టుకుంటోంది. నయనతార, జగపతిబాబు, వివేక్, తంబి రామయ్య, యోగిబాబు, రోబో శంకర్, కోవైసరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్‌లు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://youtu.be/TBeQpUkU084