HomeTelugu Trendingషాలినిని సర్‌ఫ్రైజ్ చేసిన అజిత్

షాలినిని సర్‌ఫ్రైజ్ చేసిన అజిత్

3 25‘సఖి’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి షాలిని. ఆ తర్వాత తమిళ స్టార్‌ హీరో అజిత్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు బేబీ శాలినిగా అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. నవంబరు 20న శాలిని తన 40వ పుట్టినరోజును జరుపుకొంది. ఈ సందర్భంగా నటుడు, ఆమె భర్త అజిత్‌
సర్‌ప్రైజ్‌ ఇచ్చారట. ఆ సర్‌ప్రైజ్‌ చూసి షాలిని ఆశ్చర్యపోయిందట. బీచ్‌ పక్కనే డిన్నర్‌ చేయడమంటే శాలినికి ఎంతో ఇష్టమట. దీంతో ఆమె పుట్టినరోజున అజిత్‌ చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో ఓ హాలును బుక్‌ చేసి అందులో షాలిని చిన్నప్పటి ఫొటోలతో ఆ హాల్‌ను అలంకరింపజేశారు. ఆమె క్లోజ్‌ ఫ్రెండ్స్‌ను, కాలేజ్‌లో షాలినితో పాటు చదువుకున్న
స్నేహితులను పార్టీకి పిలిచారట. ఈ విషయాలేవీ షాలినికి తెలియకుండా జాగ్రత్తపడ్డారట. ‘మనం అందరం డిన్నర్‌కు వెళ్దాం’అని చెప్పి లీలా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. లీలా ప్యాలెస్‌కు వచ్చిన షాలిని అక్కడి అలంకరణలు, తన కాలేజ్‌ ఫ్రెండ్స్‌ను చూసి ఆశ్చర్యపోయిందట. అజిత్‌ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు షాలిని ఫిదా అయిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu