Ajith New Car Price:
తమిళ నటుడు అజిత్ కుమార్ తాజాగా తన కార్ల సేకరణకు కొత్తగా పోర్సే GT3 RS కారును చేర్చుకున్నారు. ఈ వార్తను స్వయంగా అజిత్ భార్య శాలిని తెలియజేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ లగ్జరీ కార్ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో అజిత్ కూడా కనిపించారు.
ఫొటోను షేర్ చేస్తూ, శాలిని “తన వద్ద కార్ ఉంది, స్టైల్ ఉంది, అలాగే నా మనసు కూడా” అంటూ క్యాప్షన్ రాశారు. ఈ ఫొటో పోర్సే షోరూమ్ నుండి తీసినదని తెలుస్తోంది. ఫొటోలో అజిత్ కజువల్ లుక్‌లో వైట్ షర్ట్‌తో, కార్గో ప్యాంట్ లో కనిపించారు.
అజిత్ కి కార్లు, బైకులు అంటే ఎంత ఇష్టం ఉందో ఆయన కలెక్షన్స్ చూస్తే తెలుస్తుంది. ప్రయాణాలు లేదా పలు రైడ్‌లకు వెళ్లే సందర్భాల్లో ఆయన వాహనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈమధ్యనే ఆగస్టులో రూ. 9 కోట్ల విలువైన ఫెరారీని కూడా కొనుగోలు చేశారు అజిత్. ఈ ఫెరారీపై అజిత్ చేసిన రైడ్ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
ఇక తాజాగా అజిత్ కొన్న పోర్సే GT3 RS కార్ ధర ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ కార్ ధర విన్న వారంతా నోర్లు వెళ్ళబెడుతున్నారు. ఈ కార్ ధర అక్షరాలా 3.50 కోట్లు అని తెలుస్తోంది. అజిత్ తీసుకునే రెమ్యూనరేషన్ ముందు ఈ కార్ ధర చాలా చిన్నదే అని చెప్పుకోవచ్చు.
కార్లు మాత్రమే కాకుండా, అజిత్ కి బైకులపై కూడా అపారమైన ప్రేమ ఉంది. ఆయన వద్ద ఉన్న బైక్‌లలో BMW S 1000 RR, BMW K 1300 S, Aprilia Caponord 1200, Kawasaki Ninja ZX-145 వంటి ప్రముఖ మోడళ్లు ఉన్నాయి. కార్లలో Ferrari 458 Italia, BMW 740 Li, Honda Accord V6 వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయని సమాచారం.
Read More: Comedian Satya ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
సినిమాల విషయానికి వస్తే, అజిత్ ఇటీవల విదా ముయార్చి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రానికి మగీజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కాలేదు. ప్రస్తుతం అజిత్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.