దర్శక ధీరుడు రౌజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అజయ్ పాత్రకు సంబంధించి నిడివి పెంచారని వార్త వైరల్ అవుతోంది. ఆయన స్థాయికి తగ్గట్టుగా చిత్రంలో తన పాత్రకు ఎక్కువ సమయం కేటాయించారట. బాలీవుడ్ అభిమానులను నిరాశ పర్చకూడదని ఈ పనిచేశారంటున్నారు. అజయ్‌కు జోడీగా అందమైన భామ శ్రియ నటించనుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒలీవియో మోరిస్, అలియాభట్ కూడా నటిస్తున్నారు.