
బాలీవుడ్ నటి, అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ని ఎదురుకుంటున్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటోనే అందుకు కారణం. ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ దంపతులకు కూతురు ఆరాధ్య ఏకైక సంతానం. ఆరాధ్య బర్త్ డే నేడు. ఈ సందర్భంగా కుమార్తెకు బర్త్ డే విషెస్ చెబుతూ… కూతురికి ప్రేమగా ముద్దు పెడుతున్న ఫొటోను ఐశ్వర్య షేర్ చేసింది.
ఈ ఫొటోలో కుమార్తె బుగ్గ మీదో, నుదురు మీదో కాకుండా… పెదవులపైన ఐశ్వర్య కిస్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫొటోను ఐశ్వర్య షేర్ చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మేడం మీరు కూడా ఇలా చేస్తారా? అంటూ చాలా మంది నెటిజన్లు ఐశ్వర్యను ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కుమార్తె పెదవులపై ముద్దు పెట్టడం వింతగా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరైతే… ఐశ్వర్యను వెనకేసుకువస్తూ… ఈ ఫొటోలో తప్పేముంది? అని ప్రశ్నిస్తున్నారు. తల్లీకూతుర్ల మధ్య అనుబంధాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
https://www.instagram.com/p/Ck_h4ldKZGM/?utm_source=ig_web_copy_link












