సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ ను నటింపజేస్తున్న విషయం తెల్సిందే.
అయితే మహేష్ బాబు సినిమాలో ఏ సీనియర్ హీరోయిన్ నటిస్తారు అని అనుకుంటూన్న నేపథ్యంలో.. ఓ ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రకు గాను బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ని సంప్రదించే ప్రయత్నంను త్రివిక్రమ్ టీమ్ చేస్తుందట. అయితే ఈ మూవీకి ఓకే చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు సినిమాలో.. ఐశ్వర్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే ఐశ్వర్య రాయ్ తెలుగులో నేరుగా నటించే సినిమా ఇదే అవుతుంది. దీంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది.