Aishwarya Rai : ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేస్తున్నారు. భారత్ నుంచి కూడా పలువురు స్టార్స్ కూడా రెడ్ కార్పెపాట్ పై తళుక్కుమన్నారు. దీంతో ఆ ఈవెంట్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
కాగా ప్రతి ఏడాది ఈ కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఈ సారి ఆమె కేన్స్ వేడుకల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యారు.దీనికోసం ఆమె తన కుమార్తె ఆరధ్యతో కలిసి కేన్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు బయలుదేరింది. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.
అయితే ఐశ్వర్య చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించింది. దీంతో ఐశ్వర్య రాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వసాగాయి. దీంతో ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గెట్వెల్ సూన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గాయంతోనూ కేన్స్ వస్తున్న ఆమె పట్టుదలను కొనియాడుతున్నారు.
ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీతో గడుపుతుంది. కానీ పలు సినిమా ఈవెంట్స్ లో మాత్రం పాల్గొంటుంది. గత సంవత్సరం పొన్నియన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకులని అలరించింది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అలరిస్తుంది ఐశ్వర్య రాయ్. ఇటీవల ఐశ్వర్య ఎక్కడ కనపడినా తన కూతురు ఆరాధ్యతో కనిపిస్తుంది.