HomeTelugu Big Storiesమణిరత్నం మూవీ నుంచి ఐశ్వర్య రాయ్ లుక్

మణిరత్నం మూవీ నుంచి ఐశ్వర్య రాయ్ లుక్

Aiswarya in Ponnian Selvan

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్. ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తుండగా మణిరత్నం కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. చారిత్రక అంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని PS-1గా విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య 5 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. చియాన్ విక్రమ్‌తో పాటు కీలక తారలు మొత్తం ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విక్రమ్ చోళరాజు ఆదిత్య కరికాళన్‌గా కనిపించనున్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఐశ్వర్యరాయ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పళువూర్ క్వీన్ నందినిగా ఐశ్వర్య కనిపించబోతోంది. ఐశ్వర్య అందంగా కనిపిస్తున్నా ప్రతీకారం కోసం రగిలిపోయే మహారాణిగా ఆమె పాత్ర ఇందులో చాలా ప్రత్యేకంగా వుంటుందని చిత్ర బృందం తెలిపింది. ఐశ్వర్య రీఎంట్రీ తర్వాత నటిస్తున్న భారీ మూవీ ఇదే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్రబృందం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!