సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిథి మారన్ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 169వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారు. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీలో ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటించబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ‘రోబో’ సినిమాలో జంటగా నటించిన రజనీ – ఐష్ లు మరోసారి జతకట్టనున్నారు.
అయితే ఈ చిత్రానికి రజినీ స్వయంగా కథను అందిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆగస్టులో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈసినిమాలో ఓ కీలక పాత్రలో నీలాంబరి రమ్యకృష్ణ నటించనుంది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. సరికొత్త నేపథ్యంలో తెరపైకి రానున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ లో సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్ పిక్చర్స్ వర్గాలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది.