ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం పిడుగుపాటుకు గురైనట్టు సమాచారం. నిన్న రాత్రి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైందని అంటున్నారు. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమైంది. విమానంపై పిడుగు పడకున్నా ఆ ప్రభావం మాత్రం విమానంపై పడింది. దీంతో విమానం గాల్లో ఊయలలా అటూ ఇటూ ఊగిపోయిందట. ప్రయాణికులు ఎవరూ గాయపడకపోయినప్పటికీ కొంతమంది సిబ్బంది మాత్రం గాయపడ్డారట. విమానం గాల్లో షేక్ అయి వస్తువులు ఊడి పడ్డాయట. విమానం గన్నవరంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులోని 150 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Air India's AI-467 Delhi to Vijayawada flight suffered damages and crew suffered injuries when the aircraft faced severe thunderstorm. No passengers were reported injured in the incident. Air India has started the investigation in this matter. pic.twitter.com/gCs6NF2XTR
— ANI (@ANI) September 21, 2019