HomeTelugu Big Stories'అహింస' మూవీ ట్రైలర్‌

‘అహింస’ మూవీ ట్రైలర్‌

AHIMSA movie Trailer
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. గీతికా తివారీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు సినిమాలు హిట్‌ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో సినిమాలోని ప్రధాన అంశాలను దర్శకుడు పరిచయం చేశాడు. అహింస పాటించాలనే కుర్రాడు హింసకు ఎందుకు దిగాడు? అనే అంశం నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. సదా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీని జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu