HomeTelugu News'అహం బ్రహ్మస్మి' ఫస్ట్ లుక్

‘అహం బ్రహ్మస్మి’ ఫస్ట్ లుక్

9 3

డైలాగ్‌ కింగ్ మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మస్మి’. ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం బుధవారం విడుదల చేసింది. ఈ పోస్టర్లో శివభక్తుని తరహా గెటప్‌లో లుక్ అదిరిపోతుంది. మూడు విభూది నామాలు, వాటి మధ్యలో నిలువు తిలకం దిద్దుకొని కనిపిస్తున్నారు. పోస్టర్ల్‌లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం.. ప్రదర్శిస్తున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ కు అద్దం పట్టేలా ఆ లుక్స్ ఉన్నాయి. టైటిల్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఒక భిన్న థీమ్ తో ఉత్తేజభరితంగా కనిపిస్తున్న ఈ పోస్టర్, సినిమాపై అమితాసక్తిని రేకెత్తిస్తోందనడంలో సందేహమే లేదు. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ పై మంచు మనోజ్, నిర్మలాదేవి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తారాగణం ఎంపిక జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu