HomeOTTAgent OTT: ఓటీటీ కి దిక్కలేదు కానీ టీవీలో రాబోతున్న స్టార్ సినిమా

Agent OTT: ఓటీటీ కి దిక్కలేదు కానీ టీవీలో రాబోతున్న స్టార్ సినిమా

Agent OTT release still in pending
Agent OTT release still in pending

Agent OTT:

బ్లాక్ బస్టర్ సినిమా అనేది అక్కినేని అఖిల్ కి ఎప్పటినుంచో ఒక అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది. ఎప్పటికప్పుడు ప్రతి సినిమాతో డిజాస్టర్ అందుకుంటూ వస్తున్న అఖిల్ ఏజెంట్ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ అయింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమా మిగతా వచ్చినన్ని ట్రోల్స్ ఇంకా మరే సినిమా మీద వచ్చి ఉండవేమో. సినిమా విడుదల సంవత్సరం గడిచింది కానీ ఇంకా ఓటిటిలో మాత్రం ఈ సినిమా కనిపించడం లేదు. అప్పుడప్పుడు సినిమా ఓటిటిలో ఇప్పుడు విడుదల కాబోతుంది, అప్పుడు విడుదల కాబోతుంది అంటూ వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. కానీ సినిమా ఇంకా ఓటిటి లో రిలీజ్ కాలేదు.

Agent OTT:

థియేటర్లలో విడుదలైన సినిమాకే భారీ రేంజ్ లో ట్రోల్స్ వినిపించాయి. ఇక ఓటిటిలో వస్తే సినిమా మీద మీమ్స్ బాగా పెరిగిపోతాయి అన్న భయంతోనే చిత్ర బృందం సినిమాని ఓటిటిలో విడుదల చేయడం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సోనీ లివ్ వారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేశారు కానీ సరే మరి మాత్రం విడుదల చేయకుండా దాచే ఉంచారు.

అయితే ఓటిటి దూరంగా ఉంటున్న ఈ సినిమా ఇప్పుడు సడన్గా టీవీలో ప్రీమియర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ హిందీ వర్షన్ అతిత్వరలో గోల్డ్ మైన్స్ ఛానల్ లో ప్రసారం కాబోతున్న ప్రీమియర్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా తేదీ ఖరారు కాక పోయినప్పటికీ ఈ నెలలో గోల్డ్ మైన్స్ ఛానల్ లో ఏజెంట్ సినిమా ప్రసారమవుతుందట.

దీంతో ఇంకా ఓటిటిలో కూడా రాకుండా అప్పుడే టీవీలో కూడా విడుదల చేసేస్తున్నారా అని అభిమానులు మళ్లీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. మరోవైపు అఖిల్ అనిల్ కుమార్ అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అఖిల్ ఒక ట్రైబల్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాని యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu